: సైక్లింగ్ ఛాంపియన్ తో ‘రియో’ స్వర్ణ పతక విజేత వివాహం
ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ లో బ్రిటన్ సైక్లింగ్ ఛాంపియన్ లౌరా ట్రోట్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇరవై నాలుగేళ్ల లౌరా తన కంటే నాలుగేళ్లు పెద్దవాడైన సైక్లింగ్ ఛాంపియన్ జేసన్ కెన్నీని వివాహం చేసుకుని వార్తల్లోకి ఎక్కింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆమె పేర్కొంది.