: ప్రతి స్టెప్పుకు.. ప్రతి డైలాగుకు భయపడతా: హీరో సునీల్


తాను ఇప్పటివరకు ఎన్ని డ్యాన్స్ లు చేసినా, ఎన్ని సినిమాల్లో డైలాగ్ లు చెప్పినా కూడా కొత్త సినిమా అనేసరికి ఆ రెండూ చేయాలంటే టెన్షన్.. భయంగానే ఉంటుందని ప్రముఖ నటుడు సునీల్ అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ముఖ్యంగా డ్యాన్స్ విషయానికొస్తే, పక్కనే ఉండి డ్యాన్స్ అసిస్టెంట్లు, వేరేవాళ్లు చింపేస్తుంటారు. అలాంటప్పుడు వాళ్లు చేసిన తర్వాత మనం చేయలేకపోతే..అనే టెన్షన్ పట్టుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. తన కెరీర్ లో డిఫరెంట్ మూవీ అంటే ‘మర్యాద రామన్న’ అని, దానిలాగా ఇంకో డిఫరెంట్ సినిమా అంటే ‘ఈడు గోల్డ్ ఎహే’ అని తెలిపాడు. ఈ చిత్రంలో ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ వరకు కొత్త పాయింట్ తో పాటు ఫన్ ఉంటుందని, ముఖ్యంగా ‘కిడ్స్’ బాగా ఎంజాయ్ చేస్తారని సునీల్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News