: పాకిస్తాన్ వన్డే జట్టులోకి మళ్లీ స్టార్ బ్యాట్స్ మన్ అక్మల్
గత 18 నెలలుగా జట్టులో స్థానం కోల్పోయిన పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మన్ ఉమర్ అక్మల్ మళ్లీ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు అక్మల్ ను ఎంపిక చేశారు. కాగా, 2015 వన్డే వరల్డ్ కప్ లో అక్మల్ చివరి సారి ఆడాడు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అక్మల్ పాక్ జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. బ్యాట్స్ మన్ అసద్ షఫిఖ్, బౌలర్లు సోహైల్ ఖాన్, రహత్ అలీకి వన్డే జట్టులో చేరేందుకు పిలుపు వచ్చింది.