: బాలీవుడ్ భామ కత్రినా వద్ద బొమ్మ రామచిలుక


బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ వద్ద అందాల రామచిలుక ఒకటి ఉంది. అయితే, అది ప్రాణమున్నది కాదు.. చెక్కతో చేసింది. నిజమైన రామచిలుకనే పెంచుకోవచ్చు కదా, బొమ్మది ఎందుకనే అనుమానం రావచ్చు!. అందుకు, కత్రినా సమాధానమేమిటంటే, పక్షులు, జంతువులను కనుక పెంచుకుంటే వాటి ఆలనాపాలనా చూసే సమయం ఆమెకు ప్రస్తుతం లేదట. అందుకే, ప్రాణమున్న రామచిలుకకు బదులు బొమ్మ చిలుకను చూసి ఆనందిస్తున్నానని చెప్పింది. ఈ బొమ్మ రామచిలుకతో తాను కలిసి ఉన్న ఫొటోను కత్రినా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడంతో ఈ విషయం తెలిసింది.

  • Loading...

More Telugu News