: రైల్వే ఉద్యోగులకు తీపి కబురు... దసరాకు 78 రోజుల వేతనం బోనస్!


ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రైల్వే వ్యవస్థను నిర్వహిస్తున్న ఇండియన్ రైల్వేస్, ఈ దసరాకు ఉద్యోగులకు తీపి కబురు అందించనున్నట్టు తెలుస్తోంది. రైల్వేల్లో పనిచేస్తున్న 12 లక్షల మందికి ప్రతియేటా ఇచ్చే బోనస్ లో భాగంగా, ఈ సంవత్సరం 78 రోజుల బోనస్ అందనుంది. దీనిపై ఇంకా అధికారిక పర్యటన వెలువడనప్పటికీ, ఉద్యోగులు అడిగిన విధంగానే 78 రోజుల ప్రొడక్టివిటీ ఆధారిత బోనస్ కు అనుకూల నిర్ణయం మరో వారంలో వెలువడనుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్స్ జనరల్ సెక్రటరీ ఎం రాఘవయ్య వెల్లడించారు. ప్రస్తుతం క్యాబినెట్ వద్ద ఉన్న బోనస్ ఫైల్ పై ఆమోదముద్ర పడనున్నట్టు తెలుస్తోంది. ఈ బోనస్ కారణంగా ఇండియన్ రైల్వేపై రూ. 2 వేల కోట్ల వరకూ భారం పడనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News