: భక్తులు పోటెత్తడంవల్లే తొక్కిసలాట: రైల్వే మంత్రి


అలహాబాద్ కుంభమేళాకు భక్తులు కోట్లాదిగా రావడంవల్లే రైల్వే స్టేషన్ లో తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసిందని రైల్వేశాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్  వివరించారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో రెయిలింగ్ కూలడంవల్లే తొక్కిసలాట జరిగిందన్న వార్తల్లో నిజం లేదనీ .. రెయిలింగ్, వంతెనలాంటివి ఏమీ కూలలేదనీ బన్సల్ వెల్లడించారు.

అంతేగాక,
భక్తులపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎలాంటి లాఠీఛార్జ్ చేయలేదన్నారు. అయితే, ఘటనాస్థలిలో పరిస్థితిని రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారని బన్సల్ పేర్కొన్నారు. 36 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మరోవైఫు ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News