: పాక్ ను ఎండగట్టడమే లక్ష్యంగా న్యూయార్క్ బయలుదేరిన సుష్మా స్వరాజ్
ఐక్యరాజ్యసమితి వేదికగా, పాక్ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేడు న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఆమెకు పలువురు అధికారులు వీడ్కోలు పలికారు. న్యూయార్క్ లో 71 ఐరాస సాధారణ సమావేశాలు జరగనుండగా, 26వ తేదీన భారత్ తరఫున సుష్మా ప్రసంగించనున్నారు. యూరీ దాడుల ఘటన, అంతకుముందు జరిగిన పఠాన్ కోట్ సహా పలు ఉగ్రదాడులను ఆమె అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించి పాక్ పై విమర్శల వర్షం కురిపించనున్నారు. గత వారంలో ఇదే సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ, కాశ్మీర్ లో అస్థిరతకు భారత్ కారణమని చెబుతూ, ఎన్ కౌంటర్ లో మరణించిన బుర్హాన్ వనీని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అసలు కాశ్మీర్ లో పాక్ చేస్తున్నదేమిటన్నది కేంద్రంగా సుష్మా ప్రసంగించనున్నట్టు సమాచారం.