: ఫిజీలో భూకంపం.. సునామీ అవకాశాలు లేవన్న అధికారులు


ఫిజీలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.8గా తీవ్రత నమోదైంది. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలు లేవని అమెరికా భూకంప పరిశోధకులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:28 గంటలకు ఫిజీలోని ఎండోయి దీవిలో భూకంపం సంభవించింది. అయితే భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టంపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

  • Loading...

More Telugu News