: శ్రీశైలాన్ని దాటి నాగార్జున సాగర్ కు కదిలిన కృష్ణమ్మ


తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఎన్నో చోట్ల కుంభవృష్టి కురుస్తున్నప్పటికీ, ఇంతవరకూ బోసిపోయి వున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఈ సీజన్ లో తొలిసారిగా కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభమయ్యాయి. కృష్ణానది పుష్కరాల వేళ దిగువ ప్రాంతాలకు వదిలేందుకు సాగర్ జలాశయానికి వచ్చిన నీటిని నిల్వ చేయకుండా వదిలివేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా, కర్ణాటకలో కురిసిన వర్షాలకు కృష్ణమ్మకు వరద రావడం, శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి 7 అడుగుల దూరం మాత్రమే ఉండటంతో దాదాపు సగం వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1,71,144 క్యూసెక్కుల వరద వస్తుండగా, కుడిగట్టులో 7 యూనిట్ల ద్వారా, ఎడమగట్టులో 3 యూనిట్ల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ, 50 వేల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు నాగార్జున సాగర్ కు చేరుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరగడం మొదలైంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 500 క్యూసెక్కులను, హంద్రీనీవాకు 1680 క్యూసెక్కులను విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News