: ఆవు కళేబరాన్ని తొలగించేందుకు నిరాకరించిన గర్భిణి.. దళిత మహిళపై అగ్రవర్ణాల దాడి


గోవు కళేబరాన్ని తొలగించేందుకు నిరాకరించిన దళిత మహిళపై అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు దాడి చేశారు. గర్భిణి అని కూడా చూడకుండా దాదాపు 12 మంది ఆమెపైన, ఆమె భర్తపైన విచక్షణా రహితంగా దాడిచేశారు. గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లాలోని కర్జా గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుల దాడిలో గాయపడిన రనవాసియా(25), ఆమె భర్త నీలేష్ రనవాసియా(27) వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యువకుల దాడిలో మరో ముగ్గురు దళిత మహిళలు సహా ఆరుగురు గాయపడ్డారు. గర్భిణిపై దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. బట్వర్‌సిన్హ్ అనే వ్యక్తి తన పొలంలో పడి ఉన్న ఆవు కళేబరాన్ని తొలగించాల్సిందిగా నీలేష్, సంగీతాలను కోరాడని, తాము ఆ పనులు చేయడం మానేశామని వారు చెప్పడంతో కోపంతో వారిపై దాడిచేశాడని పోలీసులు వివరించారు. నీలేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News