: 'అంతొద్దు... ఇక చాలు ఆపమ్మా' అంటూ మంత్రి పీతల సుజాతకు చంద్రబాబు క్లాస్
"రాష్ట్ర అభివద్ధి ప్రదాత... మన ముఖ్యమంత్రి చంద్రబాబు..." అంటూ మంత్రి పీతల సుజాత మైకందుకున్న వేళ, "అన్ని మాటలు అవసరం లేదమ్మా... ఆపు. ఇక్కడ ముగ్గురు పిల్లలు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడించు చాలు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏలూరులో 'దోమలపై దండయాత్ర' చేపట్టిన వేళ, జరిగిన సభలో ఈ ఘటన జరిగింది.