: హైదరాబాద్ వ్యాపారిని మోసగించి రూ. 35 లక్షలతో ఉడాయించిన డిస్కో బాబా


మంత్రాలతో బంగారం, వజ్రాలను పుట్టిస్తానని చెబితే, నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారని తెలియజేస్తోందీ ఘటన. డిస్కోబాబా అలియాస్ మహ్మద్ అన్వర్ ఖాన్ అనే దొంగ బాబా చెప్పిన మాటలు విని రియాసత్ నగర్ కు చెందిన ఓ వ్యాపారి రూ. 35 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇఫ్తెకార్ హుస్సేన్ అనే వ్యాపారి డిస్కోబాబాను నమ్మి వజ్రాలు, బంగారం వస్తుందన్న ఆశతో డబ్బులు ఇచ్చాడు. పూజలు చేసిన డిస్కోబాబా, తన మాయాజాలంతో వజ్రాలు, బంగారం సృష్టించి ఇచ్చాడు కూడా. ఆ తరువాత వీటిని పరిశీలిస్తే, దొంగ బంగారం, నకిలీ వజ్రాలని తేలింది. ఆపై డిస్కోబాబాను పట్టుకుని నిలదీసినప్పటికీ, ఇచ్చిన డబ్బు రాబట్టుకోవడంలో విఫలమైన ఇఫ్తెకార్, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసి, డిస్కోబాబా కోసం వెతుకుతున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News