: కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ.3.5 కోట్ల ఆస్తి నష్టం


కూకట్‌పల్లిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా హైదర్‌నగర్‌లోని ఓ వస్త్రదుకాణంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే దుకాణం మొత్తం వ్యాపించాయి. దీంతో దుకాణం మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనలో మొత్తం మూడున్నర కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం రూ.3.5 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News