: గౌతమీపుత్ర శాతకర్ణి టైటిల్ సాంగ్ లీక్... ఆన్ లైన్లో హల్ చల్... మీరూ వినండి!
బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రం టైటిల్ సాంగ్ ఇప్పుడు ఆన్ లైన్లో ప్రత్యక్షమై హల్ చల్ చేస్తోంది. పూర్తి క్వాలిటీతో కూడిన ఈ పాటను అభిమానులు ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. "విద్రాజిత సంభ్రవాముఖా జన తేజం... సంప్రోక్షిత పాలాక్ష ప్రమోద ప్రసారం... నిజముద్రా వివితోహయ వాహనవాహం... శకయవ్వన పల్లవదీక్షిత దుర్భేద్యం... దిగ్దికాంత కీర్తిక రజనీ... శాతకర్ణీ... శాతకర్ణీ... గౌతమీ పుత్ర శాతకర్ణీ" అంటూ సాగుతుందీ పాట. శాతకర్ణి అశ్వమేధయాగం చేస్తున్న వేళ, తన తల్లి పేరు అయిన గౌతమిని తన పేరు ముందు చేర్చుకునే సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ ఎలా లీక్ అయిందన్న విషయం తెలియక నిర్మాతలు, యూనిట్ తలపట్టుకుంటుండగా, సాంగ్ సూపరన్న టాక్ వినిపిస్తోంది.