: భారత వీరత్వం సినిమాల వరకే... సైన్యాన్ని అవహేళన చేసిన మసూద్ అజర్


పాకే ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, భారత సైన్యాన్ని అవహేళన చేస్తూ చేసిన ప్రసంగానికి సంబంధించిన 9 నిమిషాలకు పైగా ఉన్న వీడియో ఒకటి ఆన్ లైన్ లో విడుదలైంది. భారత వీరత్వం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమని, హీరోలు ఒక్క దెబ్బతో పాక్ లోని ముజాహిద్దీన్ శిబిరాలపై దాడులు చేసి ఒక్క బులెట్ దెబ్బను కూడా తినకుండా వందలాది ముజాహిద్దీన్లను మట్టుబెట్టినట్టు చూపిస్తారని, అవన్నీ ఒట్టి గ్యాసేనని ఎద్దేవా చేశాడు. వాస్తవ పరిస్థితి సినిమాలకు భిన్నమని, నలుగురు జీహాదీలు వెళ్లి 18 మందిని మట్టుబెట్టడమే ఉదాహరణని చెప్పాడు. ఓ వైపు భారత ప్రభుత్వం జైషే మహమ్మద్ సంస్థను నామరూపాల్లేకుండా చేస్తుంటే, అదే దేశానికి చెందిన యువత జైషేలో చేరి పోరాడేందుకు ఆసక్తి చూపుతోందని అన్నాడు. ఈ వీడియో జైషే మహమ్మద్ అనుబంధ ఆన్ లైన్ చానల్ 'రంగొనూర్'లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News