: టీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకుంటున్న 'ముత్యాలముగ్గు' సంగీత


గతంలో తనను రాజకీయాల్లోకి రావాలని చాలా మంది ఆహ్వానించారని, అప్పట్లో ఆసక్తి చూపని తాను, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరాలని భావిస్తున్నానని అలనాటి నటి, 'ముత్యాలముగ్గు' చిత్రంతో తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న సంగీత వ్యాఖ్యానించింది. తాను పుట్టింది వరంగల్ లోనేనని, తెలుగులో 100కు పైగా చిత్రాల్లో చేశానని చెప్పిన సంగీత, మలయాళ, తమిళ పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేయడం వల్లనే చెన్నైలో స్థిరపడ్డానని, సొంత ప్రాంతాన్ని వదల్లేక ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చేశానని చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో సినీ నిర్మాతగా మారి మంచి చిత్రాలను నిర్మిస్తానని తెలిపింది. తన వయసుకు తగ్గ పాత్రలు వస్తే చేస్తానని, తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించింది.

  • Loading...

More Telugu News