: ఆ కాలేజీలో ఎంజాయ్ చేశాను... షాక్ అయ్యాను: సమంత


'మేము సైతం' కార్యక్రమంలో పాల్గొన్న సమంత, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకునేందుకు అవసరమైన నిధులు సేకరించేందుకు బాచుపల్లిలోని ఒక మహిళా కళాశాలకు వెళ్లింది. ఈ సందర్భంగా గర్ల్స్ కాలేజీకి వెళ్తానని సమంత చెప్పగానే, ఆశ్చర్యానికిగురైన మంచు లక్ష్మి బాయ్స్ కాలేజీకి వెళ్తే డబ్బులొస్తాయని అంటావని భావించానని చెప్పింది. అందుకు సమంతా నవ్వుతూ, తనకు అమ్మాయిల్లోనే ఫ్యాన్స్ ఎక్కువ అని తెలిపి, ఆ కళాశాలకు వెళ్లింది. కళాశాలలో గంటన్నర సేపు గడిపిన సమంత, 60 వేల రూపాయలు వారి నుంచి సేకరించింది. ఈ సందర్భంగా యువతులు తనను హగ్ చేసుకోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, కొంత షాక్ కు కూడా గురయ్యానని సమంత తెలిపింది. అందులో కొన్ని సామాన్లు కొనేందుకు ఖర్చైన 50 వేల రూపాయలు తీసేయగా, మిగిలిన 50 వేల రూపాయలకు మూడు రెట్లు వేసి 2 లక్షల రూపాయలు ఇచ్చింది. తమ ఎన్జీవో ప్రత్యూష నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది. దీంతో ఉన్నపళంగా ఓ కుటుంబానికి 3 లక్షల రూపాయలు సాయమందింది.

  • Loading...

More Telugu News