: నాకు తెలుగు రాదు...నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు: సమంతకు మంచు లక్ష్మి ప్రశంస
తన జీవితం పూలపానుపు కాదని సమంత తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు సుఖాలు ఉంటాయని, వాటిని అధిగమించి జీవించడమే జీవిత పరమార్థమని సమంత పేర్కొంది. తాను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని, దీంతో తన కుటుంబం మొత్తం తనపై ఆధారపడి ఉందని సమంత పేర్కొంది. అలాగే ప్రతి ఒక్కరికీ కుటుంబ బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని, కష్టాలకు వెరవకూడదని తెలిపింది. సమంత గడగడా తెలుగులో మాట్లాడడంతో ఈ టీవీ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి మాట్లాడుతూ, 'నా కంటే తెలుగు నువ్వే చాలా బాగా మాట్లాడుతున్నా'వంది. తనకు తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదని తెలిపింది. దీంతో మొహమాటపడిన సమంత...తనకు కూడా తెలుగు మాట్లాడడం పెద్దగా రాదని, కష్టపడి మాట్లాడుతున్నానని, తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరింది.