: ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అంబాసిడర్ గా రైనా


టీమిండియాలో వన్డే, టీ20 స్పెషలిస్టుగా కితాబులందుకున్న సురేష్ రైనాను దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఇంటెక్స్ టెక్నాలజీస్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రైనాను కంపెనీ కొత్త రేంజ్ స్పీకర్స్ సెగ్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ అండ్ బిజినెస్ హెడ్ (కన్సూమర్ డ్యూరెబుల్స్, ఐటీ పెరిఫెరల్స్) నిధి మార్కండేయ తెలిపారు. తమ సంస్థతో ఏడాది ఒప్పందానికి రైనా సంతకం చేశారని నిధి వెల్లడించారు. ఈ సందర్భంగా రైనా మాట్లాడుతూ, మ్యూజిక్ అంటే తనకు ఇష్టమని అన్నాడు. అందరూ మ్యూజిక్ వినే స్పీకర్ సెగ్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు నిర్వర్తించడం పట్ల ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ఇంటెక్స్ స్పీకర్స్ కు మంచి పేరుందని రైనా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News