: హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు


తాజాగా మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అతలాకుతలమైన గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. గుంటూరు జిల్లాలోని గురజాల, పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్లలో ముంపు ప్రాంతాలను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించి, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ధాటికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ ను ఆయన పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరద బాధిత ప్రాంతాలు, బాధితులకు అందిన సాయం, దెబ్బతిన్న పంటలు, రహదారులు, రైల్వే ట్రాకుల గురించిన సమాచారం అధికారుల నుంచి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News