: దుప్పట్లు, బట్టలు, ఆహారపదార్థాలు తీసుకొని రామానాయుడు స్టూడియోకి రండి: సినీనటుడు రానా


హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాలతో క‌ష్టాల్లో చిక్కున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి సినీన‌టుడు రానా త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. వ‌ర‌ద బాధితుల‌కు బట్టలు, చెప్పులు, దుప్ప‌ట్లు, ఆహార ప‌దార్థాలు విరాళంగా ఇవ్వాలని సోష‌ల్‌మీడియా ద్వారా కోరాడు. దాత‌ల నుంచి వాటిని తీసుకోవ‌డానికి రామానాయుడు స్టూడియో గేటు 24 గంటలు తెరిచే ఉంటుందని చెప్పాడు. తాము ఈరోజు హైద‌రాబాద్‌లో వ‌ర‌ద బాధిత ప్రాంతాల‌యిన‌ అల్వాల్‌లో 2000, జవహర్‌నగర్‌లో 400, మాదాపూర్‌లో 500, సికింద్రాబాద్‌లో 400ల ఆహార ప‌దార్థాల‌ ప్యాకెట్లు పంపిణీ చేశామ‌ని పేర్కొన్నాడు. దాత‌లు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి సాయం చేస్తే వాటిని వాలెంటీర్ల ద్వారా వ‌ర‌ద బాధితుల‌కు అందిస్తామ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News