: సొంత పొలంలో వ్యవసాయ పనులు చేసిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ


సినిమాల్లో రకరకాల పాత్ర‌ల్లో క‌నిపించే బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తాజాగా నిజ‌జీవితంలో రైతుగా క‌నిపించాడు. తాను స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌లోని బుధనకి ఇటీవల వెళ్లినప్పుడు సాధారణ రైతులా తన పొలంలో ప‌నులు చేశాడు. అక్క‌డి రైతులతో కాసేపు ముచ్చ‌టించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్రాక్టర్ ఎక్కి పొలాన్ని దున్నాడు. ఇటీవలే ఆ రాష్ట్ర స‌ర్కారు రైతుల కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం ‘సమాజ్‌వాదీ కిసాన్‌ బీమా యోజన’కు ఆయనను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా నియమించింది. తాజాగా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ స్పందిస్తూ.. తాను త‌న‌ స్వస్థలానికి వెళ్లినప్పుడు, పొలం ప‌నులు చేసేందుకు త‌న‌కు కొంచెం సమయం ల‌భించింద‌ని పేర్కొన్నాడు. త‌న‌ జీవితంలో 20 సంవత్సరాల పాటు వ్యవసాయమే చేసిన‌ట్లు పేర్కొన్నాడు. పూర్వీకుల వృత్తి అయిన వ్యవసాయ ప‌నులు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందని అన్నాడు.

  • Loading...

More Telugu News