: కేజ్రీవాల్ దేశానికి మేలు చేస్తాడనే నేను అనుకుంటున్నా!: అన్నా హజారే


దేశాన్ని పట్టిపీడిస్తోన్న అవినీతిని రూపుమాపడానికి సామాజిక ఉద్య‌మ‌కారుడు అన్నా హాజారే చేసిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. పలు సామాజిక సమస్యలపై త‌నతో పాటు ఒకే వేదిక‌పై వుండి పోరాడిన కేజ్రీవాల్‌పై అన్నాహ‌జారే ఇటీవల ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, తాజాగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌స్తుతం ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోన్న‌ కేజ్రీవాల్ దేశానికి మేలు చేస్తాడని తాను భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ త‌న‌ అధికారం ద్వారా మేలు చేస్తారా? లేక మరో విధంగా చేస్తారా? అన్న అంశాన్ని మాత్రం తాను చెప్పలేన‌ని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News