: ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయంలో తన ఖాతాను ప్రారంభించిన కాజోల్
బాలీవుడ్ నటి కాజోల్ భర్త అజయ్‌దేవ్‌గణ్ నటించిన 'శివాయ్' మూవీ పబ్లిసిటీలో భాగంగా కాజోల్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయంకు వెళ్లి కాజల్ తన ఫేస్‌బుక్ ఖాతాను ప్రారంభించింది. ఈ విషయాన్ని మరో సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపింది. తన భర్త అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి కాలిఫోర్నియాలో ఉన్న ఆమె అక్కడి ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపింది. ఈ సందర్భంగా అక్కడే తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్నట్లు ఆమె ట్వీట్ చేసింది. తాను అకౌంట్‌ను క్రియేట్ చేసేటప్పుడు తన భర్తతో కలిసి తీసుకున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. అంతేగాక, కారులో కూర్చొని తాను మాట్లాడిన వీడియోను కూడా ఆమె ఫేస్‌బుక్‌లో తొలి పోస్ట్‌గా పెట్టింది. ఆమె పోస్ట్ చేసిన మరో వీడియోలో తన తల్లి తనూజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.