: అచ్చు నయీమ్ లానే... పోలీసులకు షాకిచ్చిన మోనిక అలియాస్ అవినాష్!


గ్యాంగ్ స్టర్ నయీమ్... పోలీసుల నుంచి కళ్లుగప్పి, తన మార్గంలో ఆటంకాలు రాకుండా చూసుకోవాలని భావించిన వేళ, కళ్లకు కాటుక, పెదవులకు లిప్ స్టిక్, తలకు విగ్, జడలో పూలు ధరించి, ఆపై అచ్చుగుద్దినట్టు అమ్మాయిలా తయారై, ఓ బురఖా వేసుకుని పోతుంటాడని మనకు నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరమే తెలిసింది. ఇక అచ్చు గుద్దినట్టు అలాగే చేస్తూ, పోలీసుల నుంచి తప్పించుకునే బీహార్ గ్యాంగ్ స్టర్ కథ ఇది. వయ్యారంగా చీర కట్టి, చూడగానే చూపు తిప్పుకోలేనంత అందగత్తెన్న భావాన్ని కలిగిస్తూ, తానూ ఓ యువతినని కలరింగ్ ఇస్తూ, దందాలు సాగించిన అవినాష్ అనే రౌడీ విషయం తెలుసుకుని ఇప్పుడు పోలీసులే విస్తుబోతున్నారు. అమ్మాయిలకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా ముస్తాబై మోనికా అని పిలిపించుకుంటూ, అవినాష్ చేస్తున్న ఆగడాలేంటో తెలుసా? అదో భారీ సర్టిఫికెట్లు, నకిలీ ధ్రువపత్రాల కుంభకోణం! ఆధార్ కార్డు మొదలు ఐఐటీ వరకూ... మధ్యలో ఉండే టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ ... ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా చిటికెలో ఇప్పించే ముఠా ఇది. ఈ ముఠాకు ఇంకో పేరు కూడా ఉంది. అదే.. గోల్డీ ముఠా! ఇక బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుండగా, గోల్డీ బ్యాచ్ లో ఎవరికి ఫోన్ చేసినా ఇంటికి మద్యం వచ్చేస్తుంది. యువతే లక్ష్యంగా ఈ ముఠా సాగించే దందాలపై పోలీసులకు ఉప్పందించాడో బాధితుడు. పోలీసులకూ మోనికగా పరిచయమున్న ఆమె... మోనిక కాదని, అవినాష్ అని తెలియడంతో ఆశ్చర్యపోయిన పోలీసులు, ఇప్పుడు అవినాష్ ను అరెస్ట్ చేసి పాత దందాలన్నింటినీ బయటకు తీసే ప్రయత్నంలో పడ్డారు.

  • Loading...

More Telugu News