: మురళీ విజయ్ అర్ధసెంచరీ...టీమిండియా 115/1


కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మూడోరోజు ఆటలో టీమిండియా వంద పరుగుల మార్కును దాటింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 318 పరుగులు చేయగా, దీటుగా ఆడిన న్యూజిలాండ్ 262 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు బ్యాటింగ్ ను కేఎల్ రాహుల్ (38), మురళీ విజయ్ (50) ప్రారంభించారు. కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడుతూ ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో విఫలమైన రాహుల్ సోధీ బౌలింగ్ లో టేలర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 52 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ఛటేశ్వర్ పూజారా (27) క్రీజులోకి వచ్చాడు. దీంతో మురళీ విజయ్ తో కలిసి పుజారా ఇన్నింగ్స్ ను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో టీమిండియా వంద పరుగుల మార్కు దాటింది. అనంతరం మురళీ విజయ్ అర్ధసెంచరీ సాధించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 168 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంకా 9 వికెట్లు టీమిండియా చేతిలో ఉన్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి, కివీస్ పై ఒత్తిడి పెంచాలని టీమిండియా భావిస్తోంది.

  • Loading...

More Telugu News