: సరైన సమయంలో పాక్‌ను భారత్ దెబ్బకొడుతుంది: ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్
ఇటీవలే యూరీ ప్రాంతంలో చొరబడి అక్కడి మిలిటరీ బేస్ క్యాంపుపై పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. పాక్ ఆగడాలపై ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ స్పందించారు. పాకిస్థాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన విధంగా స్పందించి భారత్ ఆ దేశాన్ని దెబ్బకొడుతుందని ఆయన చెప్పారు. పాకిస్థాన్ ఇకనైనా ఇటువంటి చర్యలకు దిగడం మానుకోవాలని ఆయన సూచించారు.