: ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సినీనటులు.. బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ
హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రజలకి సాయం అందించడమే లక్ష్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సినీనటులు, శివాజీరాజా, మంచు లక్ష్మీ, మనోజ్, నవదీప్, గౌతంరాజు తదితరులు ఈరోజు నగరంలో పర్యటించారు. ‘మా’ తరఫున రాజేంద్ర ప్రసాద్ ఆల్విన్ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేశారు. బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం ధరణినగర్‌లో పర్యటించిన రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాల వాసులకు భరోసాగా ఉంటామని చెప్పారు. నిత్యావసర సరుకులు అందిస్తామని తెలిపారు.