: భారీ వర్షాల ధాటికి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూలుతున్న ఇళ్లు, స్తంభాలు, చెట్లు
తెలంగాణలో కురుస్తోన్న వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు, స్తంభాలు, చెట్లు కూలిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం రాంచంద్రపల్లిలో ఈరోజు ఐదు ఇళ్లు కూలాయి. మట్టిపెళ్లలు మీదపడి ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ సత్యనారాయణనగర్‌లో ఓ చెట్టుకూలింది. మూడు స్తంభాలు కూడా నేలకొరిగాయి. ఎటువంటి ప్రమాదం సంభవించకుండా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీ వర్షాలు కురుస్తోన్న కారణంగా శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఈరోజు 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరదలపై మంత్రులు, అధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.