: భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి: హరీశ్రావు
తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు ఈరోజు మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరదల వల్ల జిల్లాలో నష్టపోయిన పంటల గురించి ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వర్షాలతో సింగూరు ప్రాజెక్ట్లో ఇన్ఫ్లో అధికమయిందని చెప్పారు. ప్రస్తుతం నీటిని దిగువకు విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్లన్నీ జలకళ సంతరించుకున్నాయని, మరోవైపు మిషన్ కాకతీయ కార్యక్రమం ముందుకెళుతోందని చెప్పారు.