: పీవోకేలో ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు


పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఘోర ప్రమాదం సంభవించింది. ముజఫరాబాద్‌కు సమీపంలోని నౌసెహ్రీ ప్రాంతం గుండా వెళుతోన్న ఓ మినీ బస్సు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి నదిలో పడిపోయింది. ప్ర‌మాదం స‌మ‌యంలో బ‌స్సులో 26 మంది ఉన్నారు. వారిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాదస్థ‌లి వ‌ద్ద‌కు చేరుకున్న‌ పోలీసులు, రెస్క్యూ టీమ్ ముగ్గురు ప్రయాణికులను రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారు. న‌దిలో ఉన్న మృతదేహాల‌ను వెలికితీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్పటికి మూడు మృతదేహాలను బ‌య‌ట‌కు తీశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పోలీసులు మాట్లాడుతూ నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు కొట్టుకుపోయిందని చెప్పారు.

  • Loading...

More Telugu News