: 414 రోజులు ఐఎస్ఐఎస్ చెరలో ఉన్నాం: ఇంటికి చేరుకున్న ప్రొ.గోపికృష్ణ
లిబియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గతేడాది కిడ్నాప్ చేసిన తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను భారత విదేశాంగ శాఖ అధికారులు ఈరోజు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తమ ఇంటికి చేరుకున్న గోపికృష్ణ మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. 414 రోజులు ఐఎస్ఐఎస్ చెరలో ఉన్నామని పేర్కొన్నారు. తమను కిడ్నాప్ చేసినప్పటి నుంచి విడుదల చేసే వరకు జరిగిన పరిణామాలపై, అక్కడి పరిస్థితులపై సమాచారాన్నంతా భారత విదేశాంగ శాఖకు తాము ఇచ్చామని పేర్కొన్నారు.