: 8 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి పీఎస్‌ఎల్‌వీ-సి35 కౌంట్‌డౌన్‌ ప్రారంభం


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్’ వేదికగా మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. 8 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లడానికి పీఎస్‌ఎల్‌వీ-సి35 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ఈరోజు ఉద‌యం 9:12గంటలకు ప్రారంభించింది. ఎల్లుండి ఉద‌యం 9:12గంటలకు కౌంట్‌డౌన్ పూర్తికాగానే ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగ‌ర‌నుంది. ఇస్రోకు చెందిన స్కాట్‌సాట్‌-1తో పాటు, అమెరికా, అల్జీరియా, కెనడా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు, విద్యార్థులు తయారు చేసిన 2 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సి35 కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

  • Loading...

More Telugu News