: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది వ్య‌వ‌సాయ కూలీల మృతి


మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని ఉజ్జయని దేవాస్‌ రోడ్డులో మినీ ట్రక్కును లారీ ఢీకొట్ట‌డంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 15 మంది గాయాల‌పాల‌య్యారు. క్ష‌తగాత్రుల్లో ఓ గర్భిణీ కూడా ఉంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వీరందరినీ వ్య‌వ‌సాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. గాయాల‌పాల‌యిన వారిని పోలీసులు అంబులెన్స్ ద్వారా ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News