: రోహిత్ మిట్టల్‌తో డేటింగ్ నిజమే.. ఊహాగానాలకు తెరదించిన శ్వేతాబసు
దర్శకనిర్మాత రోహిత్ మిట్టల్‌తో డేటింగ్ నిజమేనని బెంగాలీ బ్యూటీ శ్వేతబసు ప్రసాద్ అంగీకరించింది. వీరిద్దరి డేటింగ్‌పై చాలా కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఇప్పటి వరకు మౌనం వహించిన శ్వేతబసు తాజాగా తమ ఇద్దరి ‘సంబంధం’పై తొలిసారి పెదవి విప్పింది. డేటింగ్ నిజమేనని, రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు పేర్కొంది. తాము చాలా హ్యాపీగా ఉన్నామని, అయితే పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. పెళ్లి మాత్రం స్మూత్‌గా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఫాంటమ్ ఫిల్మ్స్‌లో రోహిత్‌ను కలిసినప్పటి నుంచి తమ ప్రయాణం మొదలైనట్టు పేర్కొంది. వీరి ప్రేమ వ్యవహారంలో ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ప్రస్తుతం శ్వేత.. వరుణ్ ధవన్, అలియాభట్ జంటగా నటిస్తున్న ‘బ్రదీనాథ్ కీ దుల్హానియా’ సినిమాతోపాటు ఓ హిందీ సీరియల్‌లోనూ నటిస్తోంది. ‘కొత్తబంగారం లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బెంగాలీ చిన్నది తర్వాత వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముంబై వెళ్లి స్థిరపడిన ఆమెకు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో ఉద్యోగం ఇచ్చారు. అక్కడే ఆమెకు రోహిత్‌తో పరిచయం ఏర్పడింది.