: వర్షాల కారణంగా నేడు విద్యాసంస్థలకు సెలవు.. కేయూలో పరీక్షలు వాయిదా
భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. వర్షాలతో అతలాకుతలమవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు కేయూ అధికారులు ప్రకటించారు. గత వారం రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాన ముప్పు ఇంకా తప్పకపోవడం, నేడు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.