: ఏడాది తర్వాత హైదరాబాద్ చేరుకున్న తెలుగు ప్రొఫెసర్లు.. ఆనందంలో కుటుంబ సభ్యులు
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన తెలుగు ప్రొఫెసర్లు ఏడాది తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. లిబియాలో కిడ్నాప్‌కు గురైన ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణ ఏడాదిపాటు ఉగ్రవాదుల చేతిలో నరకం చవిచూశారు. అమెరికా ఆర్మీ జరిపిన దాడులతో ఉగ్రవాదులు తెలుగు ప్రొఫెసర్లను విడిచిపెట్టారు. ఐఎస్ఐఎస్ చెర నుంచి విడుదలైన ప్రొఫెసర్లను భారత విదేశాంగ శాఖ హైదరాబాద్‌కు చేర్చింది. ఏడాది తర్వాత ఉగ్రవాదుల చెర నుంచి విడుదల అయిన ప్రొఫెసర్లను క్షేమంగా ఇంటికి చేర్చిన భారత ప్రభుత్వానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున ఇంటికి చేరిన ప్రొఫెసర్లను చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.