: బైట వర్షం కన్నా, నీ హిట్ల వర్షం ఎక్కువైపోతుంది, బాబాయ్!: నానీకి సుమంత్ ట్వీట్
‘బైట వర్షం కన్నా, నీ హిట్ల వర్షం ఎక్కువైపోతుంది, బాబాయ్’ అంటూ హీరో నానికి నటుడు సుమంత్ ట్వీట్ చేశాడు. సుమంత్ నవ్వుతూ చేసిన ఈ ట్వీట్ లో నానీకి ‘కంగ్రాట్స్’ చెప్పాడు. నానీ నటించిన కొత్త చిత్రం ‘మజ్ను’ ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో సుమంత్ ఈ ట్వీట్ చేశాడు. కాగా, దర్శకుడు హరీష్ శంకర్, నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా తమ ట్వీట్ల ద్వారా ఈ సందర్భంగా నానీకి అభినందనలు తెలిపారు. సినిమా ప్రేమికుల హృదయాలను నానీ గెలుచుకున్నాడని హరీష్ శంకర్, నానీ విజయ పరంపర కొనసాగాలని నటుడు అల్లరి నరేష్, ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ అని రాజ్ తరుణ్ ఆయా ట్వీట్లలో పేర్కొన్నారు.