: తమిళసూపర్ స్టార్ రజనీని కలిసిన ధోనీ


టీమిండియా కెప్టెన్ ఎమ్.ఎస్.ధోనీ ఈరోజు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశాడు. చెన్నైలో నిర్వహించిన ‘ఎమ్ ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్ర ప్రచార కార్యక్రమానికి ధోనీ హాజరయ్యాడు. అనంతరం, ఈ చిత్ర హీరో సుషాంత్ రాజ్ పుత్, మరికొందరితో కలిసి రజనీకాంత్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి కొంచెం సేపు వారిద్దరూ ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ధోనీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘రజనీకాంత్ సార్ తో’ అంటూ పోస్ట్ చేసిన ఆ వీడియో ను ఇప్పటికే చాలామంది వీక్షించారు.

  • Loading...

More Telugu News