: ముష్టిగా ఎవరైనా వందకోట్లు వేసేటట్లయితే.. నేను రోజూ ముష్టి అడుగుతా: వెంకయ్యనాయుడు
పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ముష్టిగా ఇచ్చారని గతంలో కొందరు వ్యాఖ్యలు చేశారని, వాళ్లు ఎన్నివేల కోట్లు కొట్టేసిన వాళ్లయితే ఈ మాట అంటారంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ముష్టిగా ఎవరైనా వందకోట్లు వేసేటట్లయితే.. నేను రోజూపోయి ముష్టి అడుగుతాను. ఆ డబ్బంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖర్చు పెడతాను. ఈ విధంగా చేయడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. వంద కోట్ల రూపాయలను ముష్టితో పోలుస్తున్నారంటే.. వాళ్లు ఎన్ని వందల కోట్లను కొట్టేసిన వాళ్లు.. దోచుకున్న వాళ్లు? ఇటువంటి మాటలన్నీ దుర్మార్గమైనవి. పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి వరం. కేంద్ర తొలి కేబినెట్ సమావేశంలోనే ‘పోలవరం’ ముంపు మండలాలపై నిర్ణయం తీసుకున్నాం. 7 ముంపు మండలాలను ఏపీలో కలిపాం. ‘పోలవరం’కు ఉన్న అడ్డంకులన్నీ తొలగించింది మేమే’ అని వెంకయ్యనాయుడు అన్నారు.