: తెలంగాణలో మరో ఏడురోజుల పాటు వర్షాలు: తెలంగాణ విపత్తు నియంత్రణ శాఖ
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకి ఇప్పటికే పలు జిల్లాల్లోని ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో మరో ఏడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ విపత్తు నియంత్రణ శాఖ ఈరోజు పేర్కొంది. ఈనెల 27 వరకు భారీ వర్షాలు, 27 నుంచి 30 వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు, హైదరాబాద్‌లో కురుస్తోన్న వర్షాలపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులను నమ్మొద్దని సూచించారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.