: భద్రతాపరంగా ఎలా ముందుకెళదాం?.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పారికర్ భేటీ
జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను మరింత చక్కదిద్దడంతో పాటు భారత్, పాక్ సరిహద్దు వెంబడి ఉగ్రవాదులు ప్రవేశిస్తుండడాన్ని నిరోధించడమే లక్ష్యంగా చర్చించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ భేటీ అయ్యారు. అందులో గోవాలో నిర్వహించతలపెట్టిన బ్రిక్స్ సమ్మిట్‌కు భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చించారు. దాదాపు అర్ధగంట సేపు ఇరువురు కేంద్రమంత్రులు చర్చించారు. అక్టోబరులో గోవాలో బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది.