: వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం ఈ వరదలో కొట్టుకుపోతోంది: దేవినేని ఉమ


వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఏపీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వర్షాలు పడవని, పంటలు పండవని, నీళ్లు రావంటూ వైఎస్సార్సీపీ ఇంతకాలం తప్పుడు ప్రచారం చేసిందన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వచ్చి చేరుతున్న వరద ప్రవాహంలో వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం కొట్టుకుపోతోందన్నారు. ప్రకాశం బ్యారేజ్ లో వరదనీటిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగానే దేవినేని మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో నీరు వస్తుండటంతో పట్టిసీమ నీటిని ఆపివేశామని చెప్పారు.

  • Loading...

More Telugu News