: నయీమ్ చేసిన ఆయుధాల సరఫరాపై ఆరా.. పోలీసుల కస్టడీకి నయీమ్ అనుచరులు
తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ సయీమ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నయీమ్ అనుచరులతో పాటు నయీమ్ కేసుతో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నయీమ్ చేసిన ఆయుధాల సరఫరాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా చర్లపల్లి జైలులో ఉన్న నయీమ్ సోదరులు ఫహీం, మాజీ మావోయిస్టు టెక్‌మధులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 29వరకు వీరిని పోలీసులు ఆ అంశంపై విచారించనున్నారు. నయీమ్ చేసిన ఆయుధాల దందాపై నయీమ్ కారు డ్రైవర్ ఫయాజ్ పలు వివరాలు తెలుపుతూ... ఫహీం, టెక్‌మధు, శ్యామ్యూల్, శ్రీహరి ఆ దందాలో భాగస్వాములని తెలిపాడు. ఈ ఏడాది జులైలో హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన శ్రీధర్‌గౌడ్‌కు వారు ఆయుధాలు సరఫరా చేసినట్లు చెప్పాడు. ఫయాజ్ చెప్పిన ఆధారాలతో వారు నయీమ్ నడిపిన ఆయుధాల సరఫరాపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.