: ఏ చిన్న దాడి జరిగినా తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నాము: పాకిస్థాన్
భారత్ వైపు నుంచి ఏ చిన్న దాడి జరిగినా తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందనే వార్తలు జియో టీవీలో మార్మోగుతున్నాయి. ఇప్పటికే యుద్ధ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ చెప్పినట్లు ఆ టీవీ రిపోర్టులో పేర్కొంది. సమీప భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందని, తమ సత్తా ఏంటో భారత్ కు తెలుసని పాకిస్థాన్ రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. తమ బలగాలను మోహరించామని, యుద్ధం జరిగితే భారత్ లో దాడి చేయాల్సిన లక్ష్యాలను కూడా ఎంచుకున్నామని పాక్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నట్లుగా జియో టీవీ కథనం.