: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అదనపు బాధ్యతలు.. రోడ్లపై గుంతలు పూడుస్తున్న వైనం!
హైదరాబాద్ లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల గుంటలు పడిపోగా, మరికొన్ని చోట్ల ఎక్కడి కంకర అక్కడ పైకి లేచిపోయింది. దీంతో, వాహనచోదకులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. హైదరాబాద్ లో చాలా చోట్ల రోడ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణ చర్యలు చేపట్టడం కొంచెం కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అదనపు బాధ్యతలు స్వీకరించారు. గుంతలు పూడ్చి, ట్రాఫిక్ సాఫీగా సాగేలా చేస్తున్నారు. ముఖ్యంగా మీర్ చౌక్, సైదాబాద్ పోలీసులు సంయుక్తంగా రోడ్లపై గుంతలను పూడుస్తున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.