: అది తన వాయిస్ కాదని చంద్రబాబు ఎన్నడూ చెప్పలేదు: ఎమ్మెల్యే ఆర్కే


ఓటుకు నోటు కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున ఆ కేసు విష‌యంలో తాము క‌ల్పించుకోబోమ‌ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పందించారు. రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి చంద్రబాబు కోర్టులకెళుతూ ఆయన ఎదుర్కుంటున్న‌ కేసుల్లో స్టేలు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు ఇప్ప‌టికి మొత్తం 18 కేసుల్లో న్యాయ‌స్థానం నుంచి స్టే తెచ్చుకున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో త‌న తప్పు లేక‌పోతే చంద్ర‌బాబు స్టే ఎందుకు తెచ్చుకున్నారని ఆర్కే ప్ర‌శ్నించారు. ఆ కేసులో చంద్ర‌బాబు అడ్డంగా దొరికిపోయార‌ని, న‌ల్ల‌ధ‌నంతో తెలంగాణ‌లోని ఎమ్మెల్యేలను త‌న వైపుకు తిప్పుకోవాల‌ని చూశార‌ని ఆయ‌న అన్నారు. పోలీసులకి చిక్కిన‌ ఆడియో టేపుల్లోని వాయిస్ చంద్రబాబుదేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. టేపుల్లో ఉన్న గొంతు త‌న‌ది కాదని చంద్రబాబు ఇప్ప‌టివ‌ర‌కూ చెప్ప‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఈ కేసులో ఆయ‌న‌కు శిక్ష ప‌డితీరుతుంద‌ని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News