: గర్భిణీ నర్సుపై అకాలీదళ్ సర్పంచ్ దాడి.. సీసీ కెమెరాల్లో చిక్కిన దృశ్యాలు


పంజాబ్‌లోని మోగా ప్రాంతంలో అకాలీదళ్ పార్టీకి చెందిన ఓ స‌ర్పంచ్ ఆసుపత్రిలో ఓ న‌ర్సుపై దాడి చేశాడు. త‌న బంధువుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ చేయించుకునే క్ర‌మంలో బిల్లు కట్టించుకోవాలని అక్క‌డి సిబ్బందిని స‌ద‌రు స‌ర్పంచ్ తొంద‌ర‌ పెట్టాడు. అయితే కాస్త వేచి ఉండాల‌ని ఓ న‌ర్సు సూచించింది. ఐదు నెలల గర్భవతి అయిన ఆ నర్సును స‌ర్పంచు నెట్టి వేయ‌డంతో ఆమె కింద‌ప‌డిపోయింది. ఆ తరువాత కూడా త‌న అనుచ‌రుల‌తో న‌ర్సుపై స‌ర్పంచ్ దాడి చేశాడు. అక్క‌డి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు చిక్కాయి. బాధితురాలు ప్ర‌స్తుతం అదే ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె చేసిన‌ ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News