: ఓటుకునోటు కేసులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు.. వైసీపీ నేత వేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం


గతంలో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో ఇటీవ‌లే హైకోర్టు విచార‌ణ జ‌రిపి స్టే విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే, స్టేను సవాల్‌ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచార‌ణ జ‌రిపిన అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిష‌న్‌ను వ్య‌తిరేకించింది. ఓటుకు నోటు కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున ఆ కేసు విష‌యంలో తాము క‌ల్పించుకోబోమ‌ని చెప్పింది. హైకోర్టుకు ఈ కేసులో ప‌లు ఆదేశాలు జారీ చేస్తూ నాలుగు వారాల తర్వాత కేసుపై విచార‌ణ చేప‌ట్టి, వీలైనంత త్వరగా పూర్తిచేయాల‌ని సూచించింది.

  • Loading...

More Telugu News