: మాస్కోలో పెను విషాదం.. మంటలు ఆర్పడానికి వెళ్లి 8 మంది మృతి


రష్యా రాజధాని మాస్కో నగరంలో పెను విషాదం జరిగింది. ఆ ప్రాంతంలో ప్లాస్టిక్‌ వస్తువులు ఉన్న ఓ గిడ్డంగిలో భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. ప్ర‌మాదం గురించి సదరు గిడ్డంగి సిబ్బంది అగ్నిమాపక శాఖ‌కు స‌మాచారం అందించి, వంద మంది కార్మికులను సురక్షితంగా బ‌య‌ట‌కు పంపించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న‌ అగ్నిమాపక సిబ్బంది మంట‌ల‌ను అదుపుచేసే ప్రయత్నంలో అక్కడ కూలిన భ‌వ‌నం పైకి ఎక్కారు. అయితే హఠాత్తుగా సంభవించిన మంటల్లో చిక్కుకుపోయి మృతి చెందారు. మొత్తం ఎనిమిది మంది సిబ్బంది విధి నిర్వ‌హ‌ణ‌లోనే ప్రాణాలు కోల్పోయార‌ని అక్క‌డి సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. మొత్తం నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అగ్నికీల‌లు చెల‌రేగాయ‌ని అధికారులు తెలిపారు. ప్ర‌మాదంపై ఆరా తీస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News